దిల్ రాజుకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్?
- త్వరలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న పవన్
- 'పింక్' చిత్రంలో అమితాబ్ పాత్రను పోషించనున్న జనసేనాని
- వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం
'పింక్' చిత్రం బాలీవుడ్ లో విజయవంతమైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తమిళ వర్షన్ లో అజిత్ పోషించాడు. అదే పాత్రను ఇప్పుడు తెలుగులో పవన్ చేయబోతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.