Vijay Devarakonda: 'మజిలీ' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్ ' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో చేస్తున్న 'హీరో' సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి విజయ్ దేవరకొండ సిద్ధమవుతున్నాడు. త్వరలోనే 'ఫైటర్' సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఆ తరువాత సినిమా 'నిన్నుకోరి' .. 'మజిలీ' చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో చేయనున్నాడు. తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. విజయ్ దేవరకొండ 'హీరో' .. 'ఫైటర్' సినిమాలను పూర్తి చేసేలోగా, తను సిద్ధంగా వుండటం కోసం శివ నిర్వాణ చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నాడని సమాచారం.
Go Back to Shorts
Vijay Devarakonda
Shiva Nirvana

More Telugu News