గోపీచంద్ మలినేనితో రవితేజ చేసేది 'తెరి' రీమేక్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ మలినేనితో రవితేజ చేసేది 'తెరి' రీమేక్?

  • తమిళంలో హిట్ కొట్టిన 'తెరి'
  • గతంలోనే ట్రై చేసిన సంతోష్ శ్రీనివాస్ 
  •  కథానాయికగా శ్రుతి హాసన్
రవితేజ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'డిస్కోరాజా' సిద్ధమవుతోంది. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. 2016లో తమిళంలో విజయ్ చేసిన 'తెరి'కి ఇది రీమేక్ అనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

రవితేజతో 'తెరి' రీమేక్ చేయడానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొంతకాలం క్రితమే గట్టి ప్రయత్నాలు చేశాడుగానీ కుదరలేదు. ఇప్పుడు అదే 'తెరి' రీమేక్ ను గోపీచంద్ మలినేని చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు.  రవితేజ - శ్రుతి హాసన్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో 'బలుపు'వచ్చిన సంగతి తెలిసిందే.
Raviteja
Sruti Haasan

More Telugu News