ఐదు రోజుల్లోనే 100 కోట్లను కొల్లగొట్టిన 'హౌస్ ఫుల్ 4'
- ఈ నెల 26న వచ్చిన 'హౌస్ ఫుల్ 4'
- 5 రోజుల్లో 111.82 కోట్ల వసూళ్లు
- అక్షయ్ కి ఈ ఏడాది మూడో హిట్
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి 5 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. 5 రోజుల్లో ఈ సినిమా 111.82 కోట్లను వసూలు చేసింది. అక్షయ్ కుమార్ నుంచి ఈ ఏడాది వచ్చిన 'కేసరి' .. 'మిషన్ మంగళ్' 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాయి. తాజాగా 'హౌస్ ఫుల్ 4' కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది. అక్షయ్ కుమార్ ఈ ఏడాది వరుస హిట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.