heroine: ప్రేమికుడి టార్చర్.. భరించలేక షూటింగ్‌ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్!

షార్ట్స్‌లో చూడండి
ప్రేమికుడు పెట్టే టార్చర్ భరించలేని ఓ నటి షూటింగ్‌ను వదిలిపెట్టి వెళ్లిపోయింది. చెన్నైలో జరిగిందీ ఘటన. ఆరురాజా స్వయంగా దర్శకత్వం వహిస్తూ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బాబీలోన్’. ఈ సినిమాకు తొలుత ఓ నటిని హీరోయిన్‌గా తీసుకున్నామని, రెండు రోజుల షూటింగ్ తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆమె వెళ్లిపోయిందని ఆరురాజా తెలిపారు.

అయితే, ఆ తర్వాత తమకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసిందన్నారు. ప్రియుడి టార్చర్ భరించలేకే ఆమె షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్టు తెలిసి ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. దీంతో ఆమె స్థానంలో మరో నటి  శ్వేతా జోయల్‌‌ను తీసుకున్నట్టు తెలిపారు. బ్లూమింగ్‌ ఆర్ట్‌ స్డూడియో పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది కుటుంబ కథా చిత్రమని వివరించారు. ఓ ముఠా బారినపడిన తన చెల్లిని వారి నుంచి హీరో ఎలా కాపాడతాడన్నదే చిత్ర ప్రధాన ఇతివృత్తమని ఆరురాజా తెలిపారు.
Go Back to Shorts
heroine
escape
lover
tamil movie

More Telugu News