చంపేస్తానంటూ ప్రియురాలి మెడపై కత్తి... ఉన్మాదికి స్థానికుల దేహశుద్ధి!

  • తమిళనాడులో ఘటన
  • నడిరోడ్డుపై యువతితో వాగ్వాదం
  • ప్రేమించకుంటే హత్య చేస్తానని బెదిరింపు
నిన్న మొన్నటి వరకూ తనను ప్రేమించి, తనతో కలిసి తిరిగిన ప్రియురాలు, ఇప్పుడు దూరం పెడుతోందన్న ఆగ్రహం ఓ యువకుడిని ఉన్మాదిగా మార్చగా, ఇప్పుడతను ఊచలు లెక్కిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే యువకుడు, గత రెండేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. వ్యవహారం ఎక్కడ బెడిసి కొట్టిందో ఏమోగానీ, ఆమె అతన్ని దూరం పెట్టడం ప్రారంభించింది. ఆమెతో మాట్లాడాలని శివకుమార్ ప్రయత్నించినా, ఫలితం దక్కలేదు.

దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న శివకుమార్, ఆమె ఎప్పుడు దొరుకుతుందా? అని మాటేశాడు. నిన్న ఉదయం పన్నారీ రోడ్డులో బస్ కోసం వేచి చూస్తున్న యువతి వద్దకు వచ్చిన శివకుమార్, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తనను ప్రేమించకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. ఆమె ససేమిరా అనడంతో, తనతో తెచ్చుకున్న కత్తి తీసి, ఆమె గొంతుపై పెట్టాడు. నడిరోడ్డుపై జరుగుతున్న ఈ ఉన్మాదాన్ని చూసిన చుట్టు పక్కల వారు ధైర్యం చేసి, శివకుమార్ ను బంధించి, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
Go Back to Shorts
Tamilnadu
Lover
Erode
Police
Arrest

More Telugu News