గోపీచంద్ పై 'చాణక్య' ఫ్లాప్ ప్రభావం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోపీచంద్ పై 'చాణక్య' ఫ్లాప్ ప్రభావం

  • పరాజయాన్ని చవిచూసిన 'చాణక్య'
  • తదుపరి ప్రాజెక్టు నుంచి తప్పుకున్న నిర్మాత 
  • సెట్స్ పైకి వెళ్లే దిశగా సంపత్ నంది సినిమా
కొంతకాలం క్రితమే గోపీచంద్ రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడు. భోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఆయన ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో భోగవిల్లి ప్రసాద్ నిర్మించనున్న సినిమా రద్దు అయినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల గోపీచంద్ నుంచి వచ్చిన 'చాణక్య' భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఆ సినిమా నిర్మాత నష్టాలపాలయ్యారు. ఈ ప్రభావం కారణంగానే, గోపీచంద్ తో చేయాలనుకున్న ప్రాజెక్టును భోగవిల్లి ప్రసాద్ రద్దు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఇప్పుడు గోపీచంద్ చేతిలో సంపత్ నంది సినిమా మాత్రమే వుంది. అది కూడా భారీ బడ్జెట్ తో కూడినదే. ఈ నేపథ్యంలో ఏ తరహా కథలను తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారనే విషయంపైనే గోపీచంద్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడట.
Gopichand
Sampath Nandi

More Telugu News