రాంచీలో భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు
- రాంచీ వేదికగా పోరు
- సిరీస్ క్లీన్ స్వీప్ పై కోహ్లీ సేన దృష్టి
- ఉ.9.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం
రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ కోహ్లీ ఐసీసీ నెంబర్ వన్ స్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం 936 పాయింట్లతో ఉన్న కోహ్లీ నెంబర్ వన్ లో ఉన్న ఆసీస్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ (937) కన్నా ఒక పాయింట్ వెనకబడి ఉన్నాడు. ఈ టెస్టులో రాణిస్తే.. నెంబర్ వన్ ర్యాంకు కోహ్లీదే! స్వదేశంలో వరుసగా 11 టెస్టులు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించిన భారత్ ఈ టెస్టు కూడా గెలిచి సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.