'అల్లరి' సుభాషిణి నన్ను చూసి అందుకే భయపడి ఉంటుంది: దర్శకుడు రవిబాబు
Add ap7am to your home Screen

'అల్లరి' సుభాషిణి నన్ను చూసి అందుకే భయపడి ఉంటుంది: దర్శకుడు రవిబాబు

  • 'అల్లరి' సినిమాకి ముందు అమెరికాలో వున్నాను 
  • చాలా ఫాస్టుగా షాట్స్ తీసేవాడిని 
  • నా టేకింగ్ స్టైల్ ఆమెను కంగారు పెట్టేసిందన్న రవిబాబు
'అల్లరి' సినిమాతో దర్శకుడు రవిబాబు ఒక కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఆ సినిమాలో చేసిన చాలామందికి ఆయన లైఫ్ ఇచ్చాడు. ఆ సినిమా నుంచే నరేశ్ కి .. సుభాషిణికి 'అల్లరి' అనేది ఇంటిపేరుగా మారిపోయింది. తొలి సినిమా సమయంలో రవిబాబును చూసి తను చాలా భయపడేదాన్నని సుభాషిణి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రవిబాబు ఈ విషయంపై స్పందించాడు.

'అల్లరి' సినిమా తీయడానికి ముందు నేను అమెరికాలో ఆరేళ్ల పాటు వుండి వచ్చాను. అందువలన ఎక్కువగా ఇంగ్లిష్ మాట్లాడేవాడిని .. చకచకా షాట్స్ తీసేవాడిని. నాన్నగారు సిఫార్స్ చేయడంతో సుభాషిణిగారికి అవకాశం ఇచ్చాను. ఆమె అంతకు ముందు స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వలన ..'అల్లరి'నే మొదటి సినిమా కావడం వలన నా టేకింగ్ కి తగినట్టుగా చేయడంలో అయోమయానికి లోనైంది. నన్ను చూసి ఆమె భయపడటానికి నా ధోరణి కారణమై ఉండొచ్చు. ఆ తరువాత నేను చేసిన చాలా సినిమాల్లో ఆమె నటించింది .. చాలా మంచి ఆర్టిస్ట్" అని చెప్పుకొచ్చాడు.

Ravibabu
Ali

More Telugu News