బాక్సింగ్ లో శిక్షణ కోసం ముంబైకి వరుణ్ తేజ్
- 'గద్దలకొండ గణేశ్'తో హిట్
- బాక్సింగ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ
- జనవరిలో సెట్స్ పైకి
ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. అందువలన ఆయన 2 నెలల పాటు బాక్సింగ్ లో శిక్షణ పొందడానికి ముంబై వెళుతున్నాడు. బాక్సింగ్ లో శిక్షణను పూర్తిచేసుకుని ఆయన డిసెంబర్లో తిరిగి హైదరాబాద్ రానున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ బాణీలను సమకూర్చుతున్నాడు.