చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారు: అంబటి రాంబాబు
- జగన్ పై బాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు
- ‘జగన్ పులివెందుల పంచాయితీ..’ అని అంటారా?
- పంచాయతీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉంది
చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ ‘జగన్ పులివెందుల పంచాయితీ..’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలు తగదని అన్నారు. పంచాయితీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉందని, పులివెందుల పంచాయితీ కాదు పౌరుషానికి నిదర్శనమైన ప్రాంతమని అన్నారు. ఏపీలో ఈరోజు ప్రారంభించిన ‘కంటి వెలుగు’ పథకంపైనా చంద్రబాబు విమర్శలు చేస్తుండటంపై ఆయన మండిపడ్డారు. ఈ పథకాన్ని చంద్రబాబు తన హయాంలోనే ప్రారంభించామని, గ్రామ సచివాలయాలను కూడా తన హయాంలోనే ఆయనే ప్రారంభించారని చెప్పుకుంటున్నారని, అలా అయితే కనుక ఈ పథకాలను కాగితాలపై మాత్రమే పెట్టి డబ్బులు గుంజి ఉంటారని సెటైర్ వేశారు.