Chandrababu: విపక్ష నేత చంద్రబాబు ర్యాలీకి నో...విశాఖలో అడ్డుకున్న పోలీసులు

షార్ట్స్‌లో చూడండి
పార్టీ జిల్లా సమీక్షా సమావేశాలకు హాజరయ్యేందుకు విశాఖ విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ర్యాలీని విశాఖ పోలీసులు అడ్డుకున్నారు. విమానాశ్రయం నుంచి సెవెన్ హిల్స్‌ ఆసుపత్రి వెనుక ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయానికి ర్యాలీగా తీసుకువెళ్లేందుకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. దీంతో అధినేత అందుకు సిద్ధం కాగా పోలీసులు మాత్రం అంగీకరించ లేదు.

ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ని అడ్డుకుని కార్యకర్తలను, నాయకులను పంపించి వేశారు. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌ని విడిచిపెట్టారు. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిర్‌ పోర్టుకు విచ్చేసి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.
Go Back to Shorts
Chandrababu
visakhapatnam
rally
break
Police

More Telugu News