చిరంజీవిని అడిగి రాజకీయాల్లోకి వెళ్లాను: నటుడు రవికిషన్
- హైదరాబాద్ లో సైరా సక్సెస్ మీట్
- పాల్గొన్న రవికిషన్
- చిరంజీవి, సురేందర్ రెడ్డిలకు ధన్యవాదాలు చెప్పిన నటుడు
ఇక తాను రాజకీయాల్లోకి వెళ్లాలా? వద్దా? అని ఊగిసలాడుతున్న సమయంలో చిరంజీవిని సలహా అడిగానని రవికిషన్ గుర్తుచేసుకున్నారు. గెలుపుపై ధీమా ఉంటే తప్పకుండా ముందడుగు వేయమని ప్రోత్సహించారని, ఆయన మాటతోనే ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, ప్రచారం చేశానని, ఎన్నికల బరిలో దిగి ఎంపీగా గెలిచానని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రవికిషన్ 3 లక్షల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.