YSRCP: తేడా గాడిలా మారిపోయావేంటి శకుని మామా!: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘43 వేల మద్యం షాపులు అని ట్వీట్ పెట్టావ్ ఏంటీ చిన్న మెదడు చితికిందా? లేక పైనుంచి జారీ అరికాల్లోకి వచ్చేసిందా? మద్యం షాపునకు బెల్టు షాపుకి మధ్య తేడా తెలియని ‘తేడా గాడిలా మారిపోయావేంటి శకుని మామా’ అంటూ విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. తేడా గాడిలా మారిపోవడానికి కారణం ‘తుగ్లక్ వైఎస్ జగన్ టార్చర్ ఆ లెవెల్లో ఉందా?’ అని ప్రశ్నించారు.

 విజయసాయిరెడ్డిని చూస్తుంటే జాలేస్తోందని, జగన్ చేసిన మంచి పని ఒక్కటీ లేకపోవడంతో ఆయనకు మతిభ్రమించిందని వ్యాఖ్యానించారు. ‘శ్మశానాలకు రంగులు వేసుకున్నావు పాపం అనుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో రద్దు చేసిన బెల్టు షాపులు మీ తుగ్లక్ మళ్లీ రద్దు చేశాడా?’ అంటూ జగన్ పైనా విమర్శలు చేశారు.
Go Back to Shorts
YSRCP
cm
jagan
Telugudesam
Budha

More Telugu News