దిల్ రాజు నిర్మాతగా వరుణ్ తేజ్ కొత్త సినిమా
- వరుస హిట్లతో వరుణ్ తేజ్
- కిరణ్ కొర్రపాటితో నెక్స్ట్ మూవీ
- వెంకీ అట్లూరితో మరో సినిమా
గతంలో వరుణ్ తేజ్ - వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన 'తొలిప్రేమ' విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందువలన ఈ కాంబినేషన్ ను దిల్ రాజు మళ్లీ సెట్ చేసే పనిలో వున్నారని అంటున్నారు. అయితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రం, కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో వుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత, దిల్ రాజు ప్రాజెక్టు మొదలవుతుందని అంటున్నారు.