సీఎం పదవికి జగన్ రాజీనామా చేయాలి.. ఇంతటి అసమర్థుడిని ఎప్పుడూ చూడలేదు: హర్షకుమార్
- గోదావరిలో బోటు మునిగి ఇన్ని రోజులైనా బయటకు తీయలేకపోయారు
- నేవీ వాళ్లు ఎందుకు వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు
- ఎవరైనా సమర్థుడికి సీఎం పదవిని అప్పగించాలి
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టారని, వాస్తవాలను బయటకు రానీయకుండా చేసేందుకు మీడియాను అనుమతించడం లేదని హర్షకుమార్ మండిపడ్డారు. బోటును బయటకు తీయించడం కూడా చేతకాని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని... వైసీపీలో ఎవరైనా సమర్థులుంటే వారికి సీఎం పదవిని అప్పజెప్పాలని అన్నారు. ఇంతటి అసమర్థుడైన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని విమర్శించారు.