టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న అజారుద్దీన్.. నేడు సీఎం కేసీఆర్‌తో భేటీ!
- హెచ్‌సీఏ ఎన్నికల్లో అజర్ విజయం
- మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
- సీఎంతో సమావేశం అనంతరం పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం
హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కేటీఆర్‌ను కలిసిన అజర్ మద్దతు కోరారు. మరోవైపు, హెచ్‌సీఏపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ వివేక్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ అజర్‌కు మద్దతిచ్చింది. ఈ సందర్భంగానే పార్టీలో చేరికపై చర్చ వచ్చినట్టు చెబుతున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అజర్ నేరుగా మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కుదిరిన అవగాహనలో భాగంగా అజర్ టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను అజర్ ఖండించకపోవడం ఇందుకు మరింత ఊతమిస్తోంది.