యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలంటూ యువకుడి వేధింపులు
- కేరళలోని కోజికోడ్‌లో ఘటన
- ఘటనలో లవ్ జిహాద్ కోణం
- జాతీయ దర్యాప్తు సంస్థకు కేసు
పోలీసుల కథనం ప్రకారం.. ఫజల్ (21), బాధిత యువతి(19) ఓ ట్యూషన్ సెంటర్లో క్లాస్మేట్స్. ఈ ఏడాది జూలైలో ఆమెకు మత్తుమందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆపై వాటిని చూపించి ఇస్లాంలోకి మారాలంటూ ఒత్తిడి చేశాడు. లేకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.
ఫజల్ పదేపదే వేధింపులకు గురిచేస్తుండడంతో యువతి తన బాధను హాస్టల్లోని తన స్నేహితులకు చెప్పింది. అనంతరం విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకెళ్లి గత నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, కేసులో ‘లవ్ జిహాద్’ ఛాయలు కనిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఫజల్ తనను బెదిరిస్తూ ఇస్లాంలోకి మారాలని వేధిస్తున్నాడని యువతి పేర్కొంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.