తెలుగు రాష్ట్రాల్లో 'గద్దలకొండ గణేశ్' దూకుడు
- 'గద్దలకొండ గణేశ్'కి సక్సెస్ టాక్
- మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్
- పెరుగుతోన్న వసూళ్లు
ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన 'ఫిదా' .. 'తొలిప్రేమ' సినిమాలకంటే ఈ సినిమా వసూళ్లు ఎక్కువ. వరుణ్ తేజ్ మాస్ లుక్ .. పూజా హెగ్డే గ్లామర్ .. ఆకట్టుకునే కామెడీ .. సాంగ్స్ ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'సైరా' విడుదలయ్యే వరకూ 'గద్దలకొండ గణేశ్'కి పోటీగా నిలిచే సినిమాలేమీ లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.