చిరంజీవిగారిని చూసే 'వాల్మీకి' లుక్ ట్రై చేశాను: హీరో వరుణ్ తేజ్
- రేపే 'వాల్మీకి' విడుదల
- డిఫరెంట్ లుక్ తో వరుణ్ తేజ్
- కామెడీ హైలైట్ అంటోన్న హీరో
అందుకు వరుణ్ తేజ్ స్పందిస్తూ .. ఈ సినిమాలో నేను గెడ్డం .. మీసాలు .. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తాను. హెయిర్ స్టైల్ విషయంలో నేను చిరంజీవిగారి లుక్ నే కాపీ కొట్టాను. 'పునాదిరాళ్లు' సినిమాలో చిరంజీవి గారి హెయిర్ స్టైల్ ను ట్రై చేస్తే బాగుంటుందని భావించి అలాగే చేశాను. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా వుంది. హరీశ్ శంకర్ రాసిన కామెడీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. 'గద్దలకొండ గణేశ్'గా నేను పోషించిన పాత్ర, నా కెరియర్లో ప్రత్యేకమైనది అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.