శకుని మామా, మధ్యలో ఆగిన మీ 'జైలుయాత్ర' సినిమా త్వరలోనే పూర్తి కాబోతోంది, రెడీగా ఉండండి: బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు
- విజయసాయిరెడ్డి లక్ష్యంగా బుద్ధా వ్యాఖ్యలు
- మహామేత సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ వ్యంగ్యం
- తుగ్లక్ 100 రోజుల పాలన ప్లాన్ చేయాలంటూ సలహా
అంతేకాకుండా, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బుద్ధా ఘాటుగా స్పందించారు. ప్రజలు మీకు, మీ తుగ్లక్ సీఎం జగన్ కు సినిమా చూపిస్తారని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. ఆ రోజులు దగ్గరపడ్డాయని ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. భారీ అంచనాలతో రిలీజైన మీ '151' సినిమాని ప్రజలు "థూ" అంటున్నారని ఎద్దేవా చేశారు. "ఆ టాక్ మీకు ఇంకా చేరలేదా వైసీపీ?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.