టీమిండియా కెప్టెన్ కోహ్లీ టాప్ లెస్ పోజులు

  • ముగిసిన వెస్టిండీస్ టూర్
  • అన్ని సిరీస్ ల్లో టీమిండియానే విజేత
  • సేద దీరుతున్న విరాట్ కోహ్లీ
తాజాగా వెస్టిండీస్ టూర్ లో అన్ని సిరీస్ లను టీమిండియానే గెలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందంతో పొంగిపోతున్నాడు. యువ ఆటగాళ్లు రాణిస్తుండడంతో కోహ్లీకి పెద్దగా ఈ టూర్ లో సవాళ్లు ఎదురుకాలేదు. విండీస్ పర్యటన ముగిసిన నేపథ్యంలో తనకు నచ్చిన లొకేషన్లలో సేద దీరుతున్నాడు. తాజాగా ఓ ఫోటోషూట్ లో ఒంటిపై చొక్కాలేకుండా, చిన్నపాటి షార్ట్ తో ఫొటోలకు పోజులిచ్చాడు. వాటిలో ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన కోహ్లీ, "మనకున్న పరిమితుల్లోనే మనం జీవించగలిగితే, బయటి నుంచి ఏదీ అవసరం లేదు" అంటూ క్యాప్షన్ పెట్టాడు.
Go Back to Shorts
Virat Kohli
India
Cricket

More Telugu News