'జబర్దస్త్' నా జీవితాన్ని మార్చేసింది: అప్పారావు

  • 'జబర్దస్త్' నాకు మంచి పేరు తెచ్చింది 
  • సినిమాల్లోకంటే ఎక్కువ గుర్తింపు ఇచ్చింది 
  • 'జబర్దస్త్'కి రుణపడి ఉంటానన్న అప్పారావు 
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో అప్పారావు ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "నేను చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఇప్పటివరకూ ఓ రెండు వదల సినిమాలు పూర్తి చేసేవాడినేమో. కానీ అన్ని సినిమాలు చేసినా 'జబర్దస్త్' తో వచ్చిన గుర్తింపు వచ్చి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను.

'జబర్దస్త్' వల్లనే నేను పాప్యులర్ అయ్యాను .. సెలబ్రిటీ అనిపించుకుంటున్నాను. ఈ రోజున నేను ఎక్కడికి వెళ్లినా అంతా సెల్ఫీలు కావాలని అడుగుతున్నారంటే, అదంతా 'జబర్దస్త్' చలవే. ఈ కార్యక్రమం ద్వారానే నాకు విదేశాల్లో స్టేజ్ షోలు చేసే అవకాశం వచ్చింది. సీరియల్స్ .. సినిమాల్లో చేసే అవకాశం వచ్చింది. నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన 'జబర్దస్త్'కి నా జీవితాంతం రుణపడి వుంటాను" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Apparao

More Telugu News