ఆశా వర్కర్లకు ఎలాంటి గ్రేడింగ్ ఉండదు... పెంచిన జీతాలు సెప్టెంబరు నుంచి ఇస్తాం: మంత్రి ఆళ్ల నాని
- ఆశా వర్కర్లకు రూ.10 వేలు పూర్తిగా చెల్లిస్తామన్న మంత్రి
- ఆశా వర్కర్ల బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని వెల్లడి
- విపక్షం ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ మండిపాటు
ఆశా వర్కర్ల పాత బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఆశా వర్కర్ల హామీలను అమల్లోకి తీసుకువచ్చాని మంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేయని పనిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని వివరించారు. అది చూసి ఓర్వలేక విపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.