వెస్టిండీస్ తో మొదటి టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌటైన టీమిండియా

వెస్టిండీస్ తో నార్త్ సౌండ్ లో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 297 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ లో రహానే 81 పరుగులు చేయగా, లోయరార్డర్ లో వచ్చిన రవీంద్ర జడేజా 58 పరుగులతో రాణించాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 44, విహారి 32, పంత్ 24 పరుగులు సాధించారు. 203/6 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ ను కీమార్ రోచ్ మరోసారి దెబ్బకొట్టాడు. పంత్ ను అవుట్ చేసి భారత పతనానికి శ్రీకారం చుట్టాడు. విండీస్ బౌలర్లలో రోచ్ 4, గాబ్రియెల్ 3 వికెట్లు తీశారు. స్పిన్నర్ రోస్టన్ చేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
Go Back to Shorts
India
West Indies
Cricket

More Telugu News