Nara Lokesh: జఫ్ఫాగాళ్లు... మళ్లీ దొరికిపోయారు!: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ నేపథ్యంలో ఆయనను విడిపించడానికి విమానంలో ఢిల్లీ వెళుతున్న రామోజీరావు, నళిని చిదంబరం, నారా భువనేశ్వరి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

ఆ పోస్టులో ఓవైపు రామోజీరావు, మరోవైపు భువనేశ్వరి ఉండగా మధ్యలో మరో మహిళ కూర్చుని ఉన్నారు. పోస్టు పెట్టిన వ్యక్తి ఆమెను నళిని చిదంబరంగా పేర్కొన్నాడు. అయితే తాను నళిని చిదంబరం కానని, తనపేరు వనజ అని ఆ మహిళ స్వయంగా పేర్కొనడంతో ఆ ప్రచారానికి కాస్తంత అడ్డుకట్ట పడింది. దీనిపై నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. జఫ్ఫాగాళ్లు మరోసారి దొరికిపోయారని ఎద్దేవా చేశారు.

ఈ పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజల్ని వెర్రివాళ్లను చేయాలనుకుంటున్నారని, కొన్నిసార్లే కాదు అన్నిసార్లు అది సాధ్యం కాదన్న విషయం వారికి తెలియడంలేదని వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News