Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  అందాల కథానాయిక కాజల్ ఆగర్వాల్ ఓ సత్కార్యానికి నడుం బిగించింది. సద్గురు జగ్గీవాసుదేవ్ కు ఇచ్చిన మాట ప్రకారం, కావేరి నది పరిరక్షణ కోసం లక్ష మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయంలో సహకరించమని తన అభిమానులను కోరింది.
*  తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంతో హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగును వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని సమాచారం.
*  'బాహుబలి', 'సాహో' వంటి భారీ ప్రాజక్టులతో చిత్ర నిర్మాణం కోసం ఎక్కువ కాలాన్ని వెచ్చించాల్సి వచ్చిన ప్రభాస్, ఈ క్రమంలో తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై ఇలాంటి భారీ ప్రాజక్టుల జోలికి వెళ్లకుండా ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటానని ప్రభాస్ చెబుతున్నాడు.
Go Back to Shorts
Kajal Agarwal
Sadguru
Puri Jagannadh
Vijay Devarakonda
Prabhas

More Telugu News