విజయ్ దేవరకొండతో డేటింగ్ వార్తలు.. రష్మిక స్పందన

  • ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు
  • అలాంటివేమీ లేవని తెలిపిన రష్మిక
  • విజయ్ తనకు మంచి స్నేహితుడంటూ వ్యాఖ్య
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలసి దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. మరోవైపు, 'డియర్ కామ్రేడ్' షూటింగ్ మొదలైనప్పటి నుంచి విజయ్, రష్మికలు డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. తాజాగా ఈ అంశంపై రష్మిక క్లారిటీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని చెప్పింది. అంతకు మించి తామిద్దరి మధ్య మరేం లేదని స్పష్టం చేసింది. 
Go Back to Shorts
Vijay Devarakonda
Rashmika
Tollywood
Dating

More Telugu News