Krishna Board: కృష్ణానది బోర్డుకు ఏపీపై ఫిర్యాదు చేసిన తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ప్రభుత్వంపై కృష్ణానది బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేశారు. కృష్ణానది నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలిస్తోందని... కానీ, దాన్ని తక్కువ చేసి చూపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడుకు జాయింట్ టీమ్ ను కూడా రానివ్వకుండా అడ్డుకుంటోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని... లేకపోతే బోర్డుకు విశ్వసనీయత ఉండదని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వంతో కలసికట్టుగా వ్యవహరిస్తామని ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే... మరోవైపు బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Krishna Board
Telangana
Andhra Pradesh
Engineer in Chief

More Telugu News