cm: జగన్ ఇంట్లో ఉండే కిరణ్ కుట్రకి నీటి పారుదల శాఖ అని కలరింగ్ ఇవ్వడమేంటి?: నారా లోకేశ్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, నారా లోకేశ్ స్పందిస్తూ, ఎన్ఎస్జీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర? అని ప్రశ్నించారు. ఈ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ నివాసంలో ఉండే కిరణ్ అమలు చేస్తున్న కుట్రకి నీటి పారుదల శాఖ అని కలరింగ్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.
Go Back to Shorts
cm
jagan
Chandrababu
Telugudesam
Nara Lokesh

More Telugu News