Kiss: ఫ్యాన్సీ షాప్ కు వెళితే... దగ్గరికి లాక్కొని ముద్దిచ్చిన యువకుడు... అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
ఓ పుస్తకం కొనుగోలు చేయాలని ఫ్యాన్సీ షాప్ కు వెళితే, అక్కడ పనిచేస్తున్న ఓ యువకుడు, ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దిచ్చి, ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ సమీపంలో ఉన్న సావక్కాడులో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, త్రిసూర్‌ సమీపంలోని సావక్కాడుకు చెందిన మునీర్‌ (35), గత 20 ఏళ్లుగా కోయంబత్తూరు సమీపంలోని కారమడైలో ఉన్న ఓ స్టోర్ లో పని చేస్తున్నాడు.

అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొంటున్న ఓ విద్యార్థిని ఆంగ్ల పుస్తకం కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మునీర్, ఆమెను లోనికి తీసుకు వెళ్లి, గట్టిగా వాటేసుకుని ముద్దిచ్చాడు. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె, తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి వచ్చి, విషయాన్ని తల్లితో చెప్పింది. విద్యార్థిని తల్లిదండ్రులు కారమడై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మునీర్‌ ను నిన్న పోలీసులు అరెస్టు చేశారు.
Go Back to Shorts
Kiss
Arrest
Kerala
Tamilnadu
Coimbattore

More Telugu News