మరో వ్యాపారంలో అడుగుపెట్టిన ధోనీ

  • కశ్మీర్ లోయలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న ధోనీ
  • కార్స్24 సంస్థలో పెట్టుబడులు
  • కొత్త కాన్సెప్ట్ తో వచ్చే సంస్థలను ఎంతో ఇష్టపడతానంటూ వ్యాఖ్యలు
ప్రస్తుతం కశ్మీర్ లోయలో పారామిలిటరీ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న టీమిండియా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త వ్యాపార భాగస్వామితో జట్టుకట్టాడు. కార్స్24 అనే సంస్థలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరించనున్నాడు. ధోనీ భాగస్వామ్యంతో దేశంలో తమ బ్రాండ్ ను మరింత విస్తరించే అవకాశాలు కలిగాయని కార్స్24 యాజమాన్యం పేర్కొంది. ఈ విషయమై ధోనీ స్పందిస్తూ, కార్స్24తో చేయి కలపడం సంతోషదాయకం అని పేర్కొన్నాడు. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చే కొత్త సంస్థలకు తాను ప్రోత్సాహం అందిస్తానని, కార్స్24 కూడా అలాంటి సంస్థేనని చెప్పాడు.
Go Back to Shorts
MS Dhoni
Cars24
India
Cricket

More Telugu News