India: ఫ్లోరిడా టి20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్

షార్ట్స్‌లో చూడండి
వెస్టిండీస్ తో ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా ముందు సులువైన లక్ష్యం నిలిచింది. ఇక్కడి సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నవదీప్ సైనీ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు సాధించాడు. భువనేశ్వర్ కుమార్ 2, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ జట్టులో కీరన్ పొలార్డ్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పొలార్డ్ 2 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. నికొలాస్ పూరన్ 20 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
Go Back to Shorts
India
Cricket
West Indies
Florida
T20

More Telugu News