అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జనసేన నేత వై.వేణుగోపాల్ రావు
- ఎన్నికల ముందు జనసేనలో చేరిన ఆంధ్రా క్రికెటర్
- టీమిండియాకు 16 వన్డేల్లో ప్రాతినిధ్యం
- ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా రాణిస్తున్న వైనం
ఇక, భారత జట్టుకు ఆడే అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో వేణు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆంధ్రా క్రికెట్ సంఘం వేణు సేవలను కొనియాడింది. ఆంధ్రా క్రికెట్ అభివృద్ధికి ఎంతో సహకరించాడని క్రికెట్ సంఘం అధికారులు పేర్కొన్నారు. కాగా, సరిగ్గా ఎన్నికల సమయంలో జనసేన తీర్థం పుచ్చుకున్న వేణుగోపాల్ రావు ఎన్నికల్లో పోటీచేస్తాడంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ, వేణు పార్టీ వరకే పరిమితమయ్యాడు.