'జీటీవీ'పై కన్నేసిన అమెరికా కేబుల్ దిగ్గజం
- జీ నెట్ వర్క్ ను సొంతం చేసుకునేందుకు పలు అంతర్జాతీయ సంస్థల ఆసక్తి
- బిడ్ సమర్పించిన కామ్ కాస్ట్ నేతృత్వంలోని కన్సార్టియం
- తొలి దశలో ఉన్న చర్చలు
ఇటీవలి కాలంలో అనేక మీడియా సంస్థలు, కంటెంట్ ప్రొవైడర్లను కామ్ కాస్ట్ కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇండియాలో కూడా ప్రధాన మీడియా సంస్థను చేజిక్కించుకోవాలనే యోచనలో ఉన్న కామ్ కాస్ట్... జీ నెట్ వర్క్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.