అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు మాస్టర్స్ డిగ్రీ చేశారు: బీజేపీ నేత, సినీ నటుడు కృష్ణంరాజు

  • బాబు తన హయాంలో కేంద్రం నుంచి లబ్ధి పొందారు
  • ఆ తర్వాత అసత్య ప్రచారం చేశారు
  • అందుకే, చంద్రబాబుకు ఈ దుస్థితి
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఈరోజు ఆయన మీడియతో మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడటం, మోసాలు చేయడంలో చంద్రబాబు మాస్టర్స్ డిగ్రీ చేశారని విమర్శించారు. చంద్రబాబు తన హయాంలో కేంద్రం నుంచి లబ్ధి పొందారని, ఆ తర్వాత అసత్య ప్రచారం చేశారని, అందుకే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిపాలయ్యారని, ఈ దుస్థితి వచ్చిందని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా అదేగతి పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ హవా నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసాపురం-సఖినేటిపల్లి మధ్య గోదావరి నదిపై వశిష్ట వారధి నిర్మాణం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ వారధి నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
bjp
Krishnamraju
Ex-mp

More Telugu News