సెలెక్టర్లకు మరింత క్లారిటీ ఇచ్చిన ధోనీ!
- ఇప్పట్లో రిటైర్ కానని చెప్పిన ధోనీ
- భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా లేనని స్పష్టం చేసిన వైనం
- కుర్రాళ్లను ప్రోత్సహించాలని సెలెక్టర్ల నిర్ణయం
వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, సమర్థుడైన వికెట్ కీపర్ ను ఇప్పటినుంచే తయారుచేసుకునేందుకు వీలుగా ధోనీతో ఎమ్మెస్కే చర్చలు జరపగా, తానిప్పుడు రిటైర్ కావడంలేదని, అదే సమయంలో టీమిండియా భవిష్యత్ ప్రణాళికల్లో కూడా భాగం కాదలచుకోలేదని ధోనీ స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక తనను మేజర్ టోర్నమెంట్లకు పరిగణనలోకి తీసుకోనవసరంలేదని ధోనీనే పరోక్షంగా చెప్పడంతో కుర్రాళ్లను ఎంకరేజ్ చేయాలని భారత సెలెక్టర్లు నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే రిషబ్ పంత్ ను మూడు ఫార్మాట్లలో ప్రధాన వికెట్ కీపర్ గా విండీస్ పర్యటనకు ఎంపిక చేసినట్టు అర్థమవుతోంది.