Bigg Boss-3: టీవీ9 రిపోర్టర్ జాఫర్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన బిగ్ బాస్ రానే వచ్చింది. స్టార్ మా చానల్లో బిగ్ బాస్ మూడో సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడతలో శివజ్యోతి, రవికృష్ణ, ఆషు రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో ప్రవేశించగా, రెండో విడతలో ఆసక్తికరమైన వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. అతనెవరో కాదు, టీవీ9 చానల్ రిపోర్టర జాఫర్. తన వాక్చాతుర్యంతో ఇంటర్వ్యూలు నిర్వహించే జాఫర్ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. నాగార్జున తనదైన శైలిలో జాఫర్ ను ఆహ్వానించి బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు. ఆ తర్వాత టీవీ సీరియల్ నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, బుల్లితెర నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ కూడా బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్లుగా అడుగుపెట్టారు.
Go Back to Shorts
Bigg Boss-3
TV9 Jaffer

More Telugu News