Andhra Pradesh: జగన్ గారూ.. ఉద్యోగులకే జీతాలు ఇవ్వలేకపోతే రాష్ట్రాన్ని ముందుకెలా తీసుకెళతారు?: కేశినేని

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 4 నెలలుగా ఉద్యోగులకు వేతనాలు అందకపోవడంపై ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ‘మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోతే మీరు రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకువెళతారు ముఖ్యమంత్రిగారూ?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని ఓ పత్రికలో ప్రచురితమైన కథనం క్లిప్ ను తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
Jagan
Chief Minister
Vijayawada
muncipal corparation employees
Kesineni Nani
Telugudesam
Twitter

More Telugu News