కోహ్లీ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం వాయిదా?
- వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్
- జట్టు ఎంపిక కోసం రేపు సమావేశమవ్వాల్సిన సెలెక్షన్ కమిటీ
- గురువారం స్వదేశానికి చేరుకున్న కోహ్లీ
విండీస్ తో టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబయిలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ ఆడిన అనంతరం కెప్టెన్ కోహ్లీ ఇవాళే స్వదేశానికి చేరుకున్నాడు. దాంతో రేపు కోహ్లీ సెలెక్షన్ సమావేశానికి హాజరయ్యే పరిస్థితి కనిపించడంలేదు. చేసేదేమీలేక సెలెక్టర్లు తమ సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. శనివారం కానీ, ఆదివారం కానీ కెప్టెన్ కోహ్లీతో కలిసి సెలెక్టర్లు విండీస్ టూర్ కు జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి.