టీఆర్ఎస్ కార్యాలయ భవనాలు దసరా నాటికి పూర్తి చేయాలి: కేసీఆర్

టీఆర్ఎస్ కార్యాలయ భవనాలు దసరా నాటికి పూర్తి చేయాలి: కేసీఆర్

  • తెలంగాణ భవన్ లో ముఖ్యనేతలతో సమావేశం
  • జిల్లా కార్యాలయాల నిర్మాణం,సభ్యత్వ నమోదుపై చర్చ
  • ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కు అందజేత
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలను దసరా పండగ నాటికి పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు.

జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు  పలు అంశాలపై చర్చించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన బాధ్యులకు చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను వారికి అందించారు. నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
TRS
cm
kcr
Telangana
Bhavan

More Telugu News