వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన టీడీపీ నేత నారా లోకేశ్!
- వైఎస్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతున్న ఏపీ ప్రభుత్వం
- వైఎస్ హయాంలో పోలీసుల కాల్పులను ప్రస్తావించిన లోకేశ్
- ఆయన జయంతినే రైతు దినోత్సవంగా జరుపుతున్నారని ఎద్దేవా
‘అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల, తూటాలతో రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చినందువల్ల దేశంలో అందరూ ఆ రాజుగారి గురించి మాట్లాడుకున్నారు. కాలం గిర్రున తిరిగింది. ఆ రాజుగారి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది. కాలమహిమ!’ అని లోకేశ్ వెటకారంగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు అప్పటి వార్తాపత్రికల క్లిప్పులను జతచేశారు.