సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అంతా మన మంచికే అంటున్న రష్మిక
  • 'గరుడువేగ' సీక్వెల్ గురించి రాజశేఖర్
  • పెర్ఫ్యూమ్ కంపెనీ ఓనర్ గా నాగార్జున!
*  చిన్నప్పటి నుంచీ ప్రతి విషయంలోనూ తనది పాజిటివ్ థింకింగే అంటోంది యువ కథానాయిక రష్మిక. 'ఇలా సానుకూల దృక్పథంతో ఆలోచించడం వల్ల దేనికీ పెద్దగా కంగారుపడం. ఏదైనా మన మంచికే అనే భావన కలుగుతుంది. దీని వల్ల సమస్య నుంచి ఈజీగా బయటపడగలుగుతాం' అని చెప్పింది రష్మిక. త్వరలో ఈ ముద్దుగుమ్మ 'డియర్ కామ్రేడ్' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనుంది.
*  తాజాగా 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాక్టర్ రాజశేఖర్ తన తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేయనున్నారు. గతంలో వచ్చిన 'గరుడవేగ' చిత్రానికి ఇది సీక్వెల్ గా రూపొందుతుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్ర నిర్మాణం ఉంటుందని రాజశేఖర్ తెలిపారు.
*  అక్కినేని నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మన్మథుడు 2' చిత్రం నిర్మాణ కార్యక్రమాలను జోరుగా జరుపుకుంటోంది. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ చిత్రంలో నాగార్జున పెర్ఫ్యూమ్ కంపెనీ యజమానిగా నటిస్తున్నారు. గతంలో వచ్చిన 'మన్మథుడు'లో ఆయన యాడ్ కంపెనీ యజమానిగా నటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Rashmika
Rajashekhar
Praveen
Nagarjuna

More Telugu News