అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు... ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదు
- అటవీ భూములకు ఫెన్సింగ్ వేసేందుకు వెళ్లిన అటవీ అధికారులు
- బెదిరింపులకు పాల్పడిన వనమా
- పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్
కొత్తగూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై పోలీసు కేసు నమోదైంది. ఆయన కుమారుడు వనమా రాఘవేంద్రరావుతో పాటు పలువురు నేతలపై కూడా కేసులు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ఇటీవల అటవీ అధికారులు కందకాలను తవ్వారు. అయితే, ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు గిరిజన సాగుదారులు అడ్డుకున్నారు. ఇదే విషయాన్ని వారు వనమా దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో, ఘటనా స్థలికి చేసుకున్న ఆయన అటవీ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బెదిరించారని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ రావు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో, వనమా వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీను, ఖనాముద్దీన్ తదితరులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.