ప్రియదర్శి ఎంత గొప్ప నటుడనేది ఆ సీన్ చెప్పేస్తుంది: తాగుబోతు రమేశ్

  • 'మల్లేశం' పాత్రకి ప్రియదర్శి కరెక్ట్
  • సినిమా మొత్తానికి ఆ సీన్ హైలైట్ 
  • ప్రియదర్శి గొప్పగా చేశాడన్న తాగుబోతు రమేశ్    
తెలుగు తెరపై సందడి చేసే కమెడియన్స్ లో తాగుబోతు రమేశ్ కూడా కనిపిస్తాడు. ఇటీవల విడుదలైన 'మల్లేశం' సినిమాలోనూ ఆయన ఒక మంచి పాత్రను పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నా పాత్రలో నేను ఒదిగిపోవడానికి చాలా కష్టపడ్డాను. దర్శకుడు అనుకున్న అవుట్ పుట్ ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేశాను.

నా విషయం అటుంచితే, ప్రియదర్శి అద్భుతంగా చేశాడు. ఈ సినిమా చూసిన తరువాత ఎవరికైనా సరే, 'మల్లేశం' పాత్రకి ప్రియదర్శినే కరెక్ట్ అనిపిస్తుంది. 'అరే డబ్బులిస్తా గానీ నా కాళ్లు మొక్కి సారీ జెప్పురా' అంటూ ఒక కేరక్టర్ 'మల్లేశం'తో అన్నప్పుడు, ప్రియదర్శి చేసిన యాక్టింగ్ చూసి రోమాలు నిక్కబొడిచాయి. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలైట్. ప్రియదర్శి ఎంత గొప్ప నటుడనేది ఆ ఒక్క సీన్లో తెలిసిపోతుంది" అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
priyadarshi
thagubothu ramesh

More Telugu News