ఓటమికి అందరిదీ బాధ్యత, రాహుల్ తప్పుకోవాల్సిన పనిలేదు: వీహెచ్
- ఇప్పటికే రాజీనామా చేసిన పొన్నం, రేవంత్
- వారి బాటలోనే వీహెచ్
- నాయకుడే తప్పుకుంటే తామెలా కొనసాగుతామంటూ వ్యాఖ్యలు
తెలంగాణలో కూడా అదే సీన్ దర్శనమిస్తోంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి తప్పుకోగా, తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఓటమికి తామందరిదీ బాధ్యత అయినప్పుడు రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన అవసరం లేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కానీ, రాహుల్ పదవిలో లేకుండా తాము పదవుల్లో కొనసాగడం భావ్యం కాదని, అందుకే తప్పుకున్నట్టు వెల్లడించారు. నడిపించాల్సిన నాయకుడే బాధ్యతలు వదిలేస్తే కార్యకర్తల సంగతేంటని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.