కాళేశ్వరం ప్రాజెక్టుపై రవితేజ స్పందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాళేశ్వరం ప్రాజెక్టుపై రవితేజ స్పందన

  • ఘనంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
  • సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్న సినీ ప్రముఖులు
  • ఇంజినీరింగ్ అద్భుతమన్న రవితేజ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గవర్నర్ నరసింహన్ హాజరుకాగా... ముఖ్య అతిథులుగా ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్, ఫడ్నవిస్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. అక్కినేని నాగార్జున ఇప్పటికే తన స్పందనను తెలియజేయగా ... తాజాగా రవితేజ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతమని చెప్పడానికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పారు.
raviteja
kaleshwaram
tollywood

More Telugu News