Revanth Reddy: వెరైటీగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
లోక్ సభ సమావేశాల సందర్భంగా రెండో రోజు కూడా సభ్యుల ప్రమాణస్వీకారం కొనసాగుతోంది. నిన్న వైసీపీ, టీడీపీ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయగా... ఈరోజు తెలంగాణకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. దేశంలోనే అతి పెద్దదైన మల్కాజ్ గిరి స్థానం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో వైవిధ్యాన్ని చూపించారు. మిగిలిన సభ్యుల మాదిరి పేపర్ పై రాసిన ప్రతిజ్ఞను చదవకుండా... మొబైల్ ఫోన్ లో చూసి తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, రేవంత్ ప్రమాణస్వీకారం కోసం తన సీటు నుంచి లేచి వస్తున్న సమయంలో... ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ, రేవంత్ ను ఆహ్వానించారు.
Go Back to Shorts
Revanth Reddy
lok sabha
oath

More Telugu News