మొత్తానికి శ్రుతి హాసనే ఖరారైపోయింది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొత్తానికి శ్రుతి హాసనే ఖరారైపోయింది!

  • రవితేజతో గోపీచంద్ మలినేని
  • నిర్మాతగా ఠాగూర్ మధు
  •  త్వరలోనే సెట్స్ పైకి      
తెలుగు తెరకి శ్రుతిహాసన్ దూరమై చాలా కాలమే అయింది. బాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోందని అంతా అనుకున్నారు. కానీ లవ్ ట్రాక్ లో పడిపోయిన ఆమె, ఇటు దక్షిణాదిన .. అటు ఉత్తరాదిన కూడా అవకాశాలను గురించి ఆలోచన చేయలేదు. అయితే ఇటీవలే బాయ్ ఫ్రెండుతో రంగం చెడిన దగ్గర నుంచి తిరిగి కెరియర్ పై దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదించారు. భారీ పారితోషికాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. చాలాసార్లు బేరసారాలు జరిగిన అనంతరం శ్రుతి దిగొచ్చిందట. అందువలన ఆమెనే ఫిక్స్ చేశారనేది తాజా సమాచారం. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 
raviteja
sruthi haasan

More Telugu News