raviteja: 'మహాసముద్రం' కోసం రంగంలోకి దిగనున్న రవితేజ

షార్ట్స్‌లో చూడండి
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమాతో యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ పెరిగింది. దాంతో ఆయన తదుపరి సినిమాపై వాళ్లంతా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజయ్ భూపతి 'మహాసముద్రం' అనే కథను సిద్ధం చేసుకున్నాడు.

నాగచైతన్యతో ఈ కథను సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకున్నాడు. కొన్ని కారణాల వలన ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో, రవితేజను ఒప్పించాడు. ప్రస్తుతం 'డిస్కోరాజా' చేస్తోన్న రవితేజ, ఆ సినిమా షూటింగు పూర్తయ్యేలోగా ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో సెట్ చేసి పెట్టమని చెప్పాడట. దాంతో అందుకు సంబంధించిన పనులతో అజయ్ భూపతి బిజీగా వున్నాడట. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ ఇప్పటికే రెండు ట్యూన్స్ ఓకే చేయించుకున్నాడని సమాచారం.
Go Back to Shorts
raviteja

More Telugu News